Asianet News TeluguAsianet News Telugu

88 నుండి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి: కొండ పోచమ్మ రిజర్వాయర్ విశేషాలివీ...

ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా తెలంగాణలోని ఐదు జిల్లాలకు  గోదావరి నీళ్లు గ్రావిటీ ద్వారా తాగు, సాగు నీటిని అందించనున్నాయి. 
 

Kondapochamma Reservoir gives water to five districts in telangana
Author
Medak, First Published May 29, 2020, 11:30 AM IST

మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా తెలంగాణలోని ఐదు జిల్లాలకు  గోదావరి నీళ్లు గ్రావిటీ ద్వారా తాగు, సాగు నీటిని అందించనున్నాయి. 

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కొండ పోచమ్మ సాగర్‌ రిజర్వాయర్ కు మర్కూక్ పంప్ హౌస్ నుండి గోదావరి జలాలను శుక్రవారం నాడు ప్రారంభించారు సీఎం కేసీఆర్.  సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లోకి మర్కూక్ పంప్ హౌస్ నుండి గోదావరి నీళ్లు చేరుతాయి. 

 హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేలా 15 టీఎంసీల సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మాణం చేపట్టారు. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో 15 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొనే సామర్ధ్యం ఉంటుంది. 

ఈ రిజర్వాయర్ వలయాకారం కట్ట 15.8 కిలోమీటర్లుఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1540 కోట్లు. ఈ రిజర్వాయర్ల ద్వారా 2,85,280 ఎకరాలకు సాగు నీరు అందనుంది. మరో వైపు హైద్రాబాద్ తాగు నీటి అవసరాలను కూడ తీర్చనుంది ఈ రిజర్వాయర్.

కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్,యాదాద్రి భువనగిరి జిల్లాలకు సాగు నీరు అందనుంది.  ఈ రిజర్వాయర్ ద్వారా రామాయంపేట, గజ్వేల్, ఉప్పరపల్లి, కిష్టాపూర్, తుర్కపల్లి, జగదేవ్ పూర్, తుర్కపల్లి(ఎం), శంకరంపేట, సంగారెడ్డి ప్రధాన కాల్వలున్నాయి.

557 మీటర్ల ఎత్తులోని రంగనాయక్‌సాగర్‌ నుంచి తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌ కు గోదావరి నీళ్లు చేరుతాయి. అక్కడి నుంచి అక్కారం, మర్కూర్‌ పంప్‌హౌజ్‌లలో ఎత్తిపోయడం ద్వారా గోదావరి జలాలు 618 మీటర్ల ఎత్తులోని 15 టీఎంసీల సామర్థ్యం గల కొండపోచమ్మ కు చేరుకుంటాయి. లక్ష్మీబరాజ్‌ నుంచి సుమారు  214 కిలోమీటర్లు ప్రవహించి ప్రాజెక్టులోనే అత్యంత ఎత్తుకు చేరుకుంటాయి. 

ఈ రిజర్వాయర్‌కు మూడు ప్రధాన స్లూయిస్‌ గేట్లు ఉన్నాయి. సంగారెడ్డి కెనాల్‌ నుంచి సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాలకు నీటిని పంపిస్తారు. జగదేవ్‌పూర్‌ కెనాల్‌ నుంచి యాదాద్రి జిల్లాకు నీటిని అందిస్తారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట వద్ద నిర్మిస్తున్న కేశవపూర్‌  రిజర్వాయర్‌ ద్వారా జంటనగరాలకు తాగునీరు అందిస్తారు.

also read:మర్కూక్ పంప్‌హౌస్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

మేడిగ‌డ్డ వ‌ద్ద స‌ముద్ర‌మ‌ట్టానికి 88 మీట‌ర్ల ఎత్తులో ఉన్న గోదారిని మ‌ళ్లించారు. అదే నీటిని తెలంగాణ‌లోని అత్యంత ఎత్తైన‌ ప్ర‌దేశంలో కొండపోచమ్మ సాగర్ కు తరలించారు. కొండపోచ‌మ్మ వ‌ద్ద సముద్ర‌మ‌ట్టానికి 618 మీట‌ర్ల ఎత్తులో నిర్మించిన రిజ‌ర్వాయ‌ర్‌కు ఆ జ‌లాలు చేరుకొన్నాయి.

88 మీట‌ర్ల ఎత్తులో ఉన్న మేడిగ‌డ్డ నుంచి 618 మీట‌ర్ల ఎత్తులో ఉన్న కొండ‌పోచ‌మ్మ వ‌ద్ద‌కు గోదారి జ‌లాలు శుక్రవారం నాడు చేరుకొన్నాయి.ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 270 కిలోమీట‌ర్ల దూరం గోదారి జ‌లాలు ప్ర‌వ‌హించ‌నున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios