నల్గొండ: పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు దక్కకపోవడం దారుణమని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  పార్టీ మారాలనే నిర్ణయం కూడ ఇదే కోవలోకి  వస్తోందన్నారు.

ఆదివారం నాడు ఆయన భువనగిరిలో మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  పార్టీ మారడం వ్యక్తిగత విషయమని ఆయన చెప్పారు.  పేద ప్రజలకు ఇళ్లు కట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

పాడి రైతులకు లీటర్‌కు రూ.4 పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.  లేకపోతే  ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.  మల్లన్నసాగర్‌ కింద భూములు కోల్పోయిన రైతులకు ఏ తరహాలో పరిహారం చెల్లించారో  బస్వాపురం రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు.