మా నాన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించండి అంటూ ఆయన  కుమార్తె శ్రీనిధి కోరారు. ఈ మేరకు ఆమె అమెరికా నుంచి ప్రకటన విడుదల చేశారు.  ఇప్పటివరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఐదోసారి కూడా కూడా గెలిపించాలని ఆయన కుమార్తె కోరారు.

అంత్యంత ఆలోచన పరులైన నల్గొండ నియోజకవర్గ ఓటర్లు సముచితమైన నిర్ణయం తీసుకొని నిరంతరం ప్రజల మధ్య ఉండే తన తండ్రి వెంకట్ రెడ్డిని గెలిపించాలని కోరారు. చిన్న గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన తన తండ్రి ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ప్రజలందరికీ ఎంతో దగ్గరయ్యాడని ఆమె తెలిపారు. ఫ్లోరైడ్ రహిత నీటిని ప్రజలకు అందించేందుకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.