ఆనాడు కేసీఆర్... నేడు రేవంత్...: కిన్నెర మొగులయ్య పాట మాత్రం అదేే...

తెలంగాణ కళాకారుడు కిన్నెర మొగులయ్య మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రిని కొనియాడుతూ పాట పాడారు. అయితే గతంలో కేసీఆర్ ను పొగుడుతూ పాడిన ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొనియాడారు. 

Kinnera Mogilaiah sung song On CM Revanth Reddy AKP

హైదరాబాద్ : కిన్నెర మొగులయ్య ... అరుదైన పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు. తెలంగాణ జానపదాలకు తన కిన్నెర బాణీలు జోడించి అద్భుత గానం చేస్తుంటాడు. తాజాగా అతడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు తన కిన్నెరను వాయిస్తూ గానం చేసాడు. తనను పొగుడుతూ మొగులయ్య పాడిన పాటకు రేవంత్ ఫిదా అయ్యారు. 

పాలమూరు జిల్లాలో పులి పుట్టింది... అన్నమాట తప్పడు, అడుగు వెనక్కి తియ్యడు అంటూ సీఎం రేవంత్ రెడ్డిను కొనియాడుతూ మొగులయ్య పాట పాడారు. అతడి గానాన్ని, అందుకు తగినట్లుగా కిన్నెర స్వరాన్ని రేవంత్ తో పాటు మంత్రి సురేఖ ఆసక్తిగా విన్నారు. ఈ సందర్భంగా మొగులయ్యను సీఎం రేవంత్ అభినందించారు.

అయితే  గతంలో ఇదే దర్శనం మొగులయ్య ఆనాటి సీఎం కేసీఆర్ ను కలిసారు. అప్పటి సీఎం క్యాంప్ ఆపీస్ ప్రగతి భవన్ లో మొగులయ్యను శాలువాతో సత్కరించారు కేసీఆర్. అతడిని ప్రత్యేకంగా అభినందించిన కేసీఆర్ ఆర్థిక సాయం, ఇంటి స్థలం హామీ ఇచ్చారు.  ఇప్పటిలాగే ''అన్నమాట తప్పలేవు... ముందడుగు వేసి తెలంగాణ తెచ్చావు... ముఖ్యమంత్రి అయ్యావు... శభాష్'' అంటూ కేసీఆర్ ను కొనియాడుతూ పాటపాడారు మొగులయ్య. 

 

ఎవరీ మొగులయ్య?  

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని  అవుసలికుంట గ్రామానికి చెందిన మొగులయ్య కిన్నెర వాయిద్యకారుడు. చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ అరుదైన పన్నెండు మెట్ల కిన్నెరను వాయిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే పవన్ కల్యాణ్ మూవీ భీమ్లా నాయక్ పుణ్యమా అని మొగులయ్య టాలెంట్ బయటకు వచ్చింది. ఈ మూవీ టైటిల్ సాంగ్ మొగులయ్య స్వరంతోనే ప్రారంభం అవుతుంది. ఈ పాట హిట్ కావడంతో మొగులయ్యతో పాటు అతడి కిన్నెర గానం చాలా ఫేమస్ అయ్యింది.

మొగులయ్య కళను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అత్యున్నత అవార్డును ప్రదానం చేసింది. దేశంలోనే నాలుగో అత్యున్నత పౌర పురస్కారం  'పద్మశ్రీ' తో మొగులయ్యను సత్కరించింది. దీంతో మొగులయ్య టాలెంట్ తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశానికి తెలిసింది. 

కేసీఆర్ సర్కార్ సాయం : 

తెలంగాణ గ్రామీణ కళాకారుడు మొగులయ్యకు సాయం చేసేందుకు ఆనాటి కేసీఆర్ సర్కార్ ముందుకు వచ్చింది. అతడికి కోటి రూపాయల నగదుతో పాటు హైదరాబాద్ లో ఇంటిస్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా మొగులయ్య అవార్డులతో పాటు రివార్డులను కూడా అందుకున్నారు.  

మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా మొగులయ్యకు ఆర్థిక సాయం చేసారు. అలాగే ఆర్టిసి ప్రయాణంపై మొగులయ్య పాడిన పాటకు ఫిదా అయిన తెలంగాణ ఆర్టిసి ఎండి సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మొగులయ్యకు తెలంగాణ ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించింది.  ఇలా గత ప్రభుత్వం మొగులయ్యకు సాయం చేసింది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios