హైదరాబాద్ నగరంలో ఓ కిడ్నాప్ కలకలం సృష్టించింది. కాగా.. కిడ్నాప్ కి గురైన వారంతా తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులు కావడం గమనార్హం. కాగా.. కిడ్నాప్ కి గురైనవారిని కిడ్నాపర్లు.. నార్సింగిలో ముగ్గురిని కిడ్నాపర్లు వదిలి పారిపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ లోని బోయినపల్లికి చెందిన ప్రవీణ్, నవీన్, సునీల్  అనే ముగ్గురు కిడ్నాప్ కి గురయ్యారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కాగా.. చివరకు వీరిని కిడ్నాపర్లు నార్సింగ్ లో వదిలేసి వారు పారిపోయారు. వీరు సీఎం కేసీఆర్‌ సోదరి తరఫు సమీప బంధువులు. వీరు ముగ్గురూ సీఎం కేసీఆర్‌ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. 

గత రాత్రి 11 గంటల సమయంలో  సినీఫక్కీలో హకీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు కిడ్నాప్‌‌కు గురయ్యాడు. ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డ కిడ్నాపర్లు.. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్‌రావు సహా ఇద్దరు సోదరులను దుండగులు కిడ్నాప్‌ చేశారు. 

కుటుంబసభ్యుల ఫిర్యాదుతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్, నవీన్, సునీల్‌లను వికారాబాద్‌లో గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేయగా...మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ సోదరుడు చంద్రహాస్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. హాఫీజ్‌పేటలోని వంద కోట్ల విలువైన భూమి కోసం కొంతకాలంగా గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ ముగ్గురు సోదరులు క్షేమంగా ఉన్నారని ప్రవీణ్‌ సోదరుడు ప్రతాప్‌ తెలిపారు. వెంటనే స్పందించిన తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు.