తెలంగాణ ఎన్నికల వేళ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బుడాన్ బేగ్ పార్టీని వీడుతున్నట్లుగా తెలిపారు.

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకనేతగా ఉన్న బేగ్ ప్రస్తుతం ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా వ్యవహారిస్తున్నారు. ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంతో పాటు మరికొన్ని విషయాల్లో హైకమాండ్‌పై అసంతృప్తిగా ఉన్న బుడాన్ బేగ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.

ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆయనకు మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో బేగ్‌ను బుజ్జగించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగంలోకి దిగారు. మరోవైపు మహాకూటమి నేతలతో బేగ్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.