Khammam: ఖమ్మంలోని జ‌వ‌హ‌ర్ నవోదయ పాఠశాలలో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందాడు. పాలేరులో జవహర్‌ నవోదయ స్కూల్‌లో విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. విద్యార్థి మృతి చెందడంతో ప్రిన్సిపాల్‌ ఏ చంద్రబాబును విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. 

Student electrocuted at Navodaya School: ఖమ్మంలోని జ‌వ‌హ‌ర్ నవోదయ పాఠశాలలో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందాడు. పాలేరులో జవహర్‌ నవోదయ స్కూల్‌లో విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. విద్యార్థి మృతి చెందడంతో ప్రిన్సిపాల్‌ ఏ చంద్రబాబును విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఖ‌మ్మం జిల్లాలోని కూసుమంచి మండలం పాలేరులోని జవహర్‌ నవోదయ పాఠశాలలో శనివారం విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మండలంలోని కోక్య తండాకు చెందిన దుర్గా నాగేందర్‌(16) అనే విద్యార్థి ఇతర విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రధాన ద్వారం వద్ద నేమ్‌బోర్డ్‌ను ఏర్పాటు చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ప్రవేశ ద్వారం మీదుగా వెళుతున్న 11kv విద్యుత్ సరఫరా లైన్ త‌గిలి విద్యుత్ షాక్​కు గురయ్యారు. ఆస్ప‌త్రికి త‌ర‌లించే స‌మ‌యంలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. విద్యార్థులతో స్కూళ్లో ప‌నిచేయించ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల వద్ద నిరసనకు దిగారు.

న‌వోదయ విద్యాలయంలో శనివారం 12వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందడంతో ప్రిన్సిపాల్‌ ఏ చంద్రబాబును విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌విఎస్) హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కమిషనర్ టి గోపాల కృష్ణ శనివారం అర్థరాత్రి సమయంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో చంద్ర బాబును తక్షణమే సస్పెండ్ చేసినట్లు, ఎన్‌విఎస్ ప్రాంతీయ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు తెలిపారు. ఆగస్ట్ 3 నుంచి పాలేరు నవోదయ విద్యాలయంలో జరగాల్సిన ప్రాంతీయ స్థాయి క్రీడా పోటీల కోసం విద్యార్థులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని స‌మాచారం.