ప్రతీదాంట్లోనో నేటి యువత కొత్తదనాన్ని కోరుకుంటోంది. సామాన్యుడైనా, కలెక్టరైనా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. అలా ఓ ట్రైనీ కలెక్టర్ తన వివాహా ఆహ్వాన పత్రికను వెరైటీగా రూపొందించి.. ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. వీడియో రూపంలో ఉన్న ఈ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ గా మారింది. 

ఖమ్మం : ఓ ఐఏఎస్ అధికారి wedding invitation ఇప్పుడు నెట్టింట viral గా మారిపోయింది. తొలిచూసు నుంచి పెళ్లి పీటల వరకు జరిగిన తమ లవ్ స్టోరీని peotryగా మలిచి.. ఓ సినిమా స్టైల్ లో Animation రూపంలో తయారు చేసిన వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా Trainee Collector గా పని చేస్తున్న Rahulది మహబూబ్ నగర్ జిల్లా.. ఈ నెల 10వ తేదీన మనీషా అనే యువతిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన రూపొందించిన వెడ్డింగ్ కార్డు అదరహో అంటుంది.

రాహుల్-మనీషా.. ప్రేమకు పెద్దలు ఓకే చెప్పడంతో పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇక, తొలిచూసు నుంచి జరిగిన వారి ప్రయాణాన్ని మొత్తం షార్ట్ కట్ లో చెప్పుకొచ్చారు రాహుల్.. బస్సులో వారు కలిసి ప్రయాణం చేయడం.. మొదట ఆకర్షణ, ఆ తర్వాత మాటలు కలవడం, బస్సు జర్నీ కాస్తా బైక్ ఎక్కడం.. ఎక్కడో తెలియని మొహమాటం.. చివరకు దేవాలయం వద్ద వారి ప్రేమ చిగురించిన విధానం.. ఆ ప్రేమ ముందుకు సాగి.. పెద్దల వరకు చేరడం.. వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆ తరువాత జరిగిన ఎంగేజ్ మెంట్, పెళ్లి ఫిక్స్ చేయడం.. ఇలా అన్నీ వీడియో రూపంలో చూపించారు. 

ఈ నెల 10న ఉదయం 11 గంటల 55 నిమిషాలకు ఐఏఎస్ ఆఫీసర్ రాహుల్-మనీషా వివాహం మహబూబ్నగర్లో జరగనుంది. మొత్తంగా ఖమ్మం ట్రైనీ కలెక్టర్ గా పని చేస్తున్న రాహుల్ తన వాయిస్ తో ఒక అందమైన కవితను జోడించి.. ఓ సినిమా స్టైల్ లో యానిమేషన్లో తయారుచేసిన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు అందరినీ కట్టిపడేస్తుంది. కాబోయే కలెక్టర్ రాహుల్ చేసిన ఈ ప్రయోగం అందరినీ ఆకర్షిస్తోంది. 

ఇదిలా ఉండగా, నిన్న మరో వెడ్డింగ్ కార్డ్ వైరల్ అయ్యింది. Chhattisgarhలోని జష్‌పూర్ జిల్లాలో ఓ గిరిజన యువకుడి విచిత్ర Wedding Invitation card వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ కార్డ్ దేశవ్యాప్తంగా Social mediaలో వేగంగా Viralగా మారుతోంది. వెడ్డింగ్ కార్డ్‌లోని ముఖ్యాంశాలు మొత్తం Aadhaar card రూపంలో ప్రింట్ చేశారు. దీంతో పాటు.. కార్డు వెనకభాగంలో ఆధార్ కార్డు సమాచారం ఉండే ప్రాంతంలో.. Corona virus మహమ్మారిని నివారించడానికి అవసరమైన నియమాల గురించి రాసుకొచ్చారు. అంతేకాదు ఈ ఆహ్వాన పత్రికలో ఆధార్ కార్డ్ నంబర్ స్థానంలో పెళ్లి తేదీని ప్రింట్ చేశారు. 

ఈ ప్రత్యేక కార్డును, వినూత్నంగా రూపొందించిన వివాహ ఆహ్వాన పత్రంను చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడుతున్నారు. యువజన సంఘంలోని వారైతే ఈ పత్రికను తమ స్నేహితులకు పంపి, వారినీ ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నారు. ఇక ఈ కార్డు రూపకర్త, పెళ్లి కొడుకు ఎవరంటే.. అంకిరా గ్రామానికి చెందిన లోహిత్ సింగ్. కరోనా మహమ్మారి సమయంలో అతనికి చేదు అనుభవాలు ఉన్నాయి. అలాంటి ప్రమాదం ఎవ్వరికీ రావొద్దని.. అందరూ సురక్షితంగా ఉండాలన్న ఆలోచనతోనే ఈ కార్డును ఇలా రూపొందించాడట.