తిరుపతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠ ద్వారా శ్రీవారి దర్శనం చేసుకునేందుకు తిరుమలలోని శ్రీకృష్ణ అతిధి గృహంకు శోభ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ రిసెప్షన్ అధికారులు ఆమెకు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. 

ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శోభను పలకరించారు. ఆత్మీయ స్వాగతం పలికారు. కాసేపు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్ననారు. అయితే ఈ రాత్రికి తిరుమలలోనే బస చేసి మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు కేసీఆర్ సతీమణి శోభ.