హుజూరాబాద్ మీద దృష్టి: మహిళా ఎంపీటీసీ భర్తతో కేసీఆర్ ఫోన్ సంభాషణ
హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఎంపీటీసీ నిరోష భర్త రామస్వామితో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు.
హైదరాబాద్: హుజూరాబాద్ శానససభ నియోజకవర్గం ఉప ఎన్నికపై తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు దృష్టి సారించారు. రాష్ట్రం లో కొత్తగా ప్రవేశ పెట్టిన దళిత బందు పథకాన్ని హుజూరాబాద్ ను పైలట్ ప్రాజెక్ట్ గా ప్రకటించి హుజూరాబాద్ నుండి ప్రారంభించాలని ఇదివరకే నిర్ణయించారు.
ఈ నెల 26 న హుజూరాబాద్ నియోజక వర్గం లో ని 427 మంది దళితులలో సిఎం కేసీఆర్ సమావేశం కానున్నారు అందుకు జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన ఎంపిటిసి నిరోష భర్త వాసల రామస్వామికి స్వయం గా సిఎం కేసీఆర్ మాట్లాడిన ఆడియో కాల్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఈ నెల 26 న ప్రగతి భవన్ కు రావాలని దళిత బందు పథకం గురించి నియోజక వర్గంలో అందరికి వివరించాలని ఇది ప్రపంచం లోనే పెద్ద పథకమని చెప్పారు. ప్రతి గ్రామం నుండి ఇద్దరు చొప్పున రావాలని దీనికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు.
దళిత బంధు పథకం ప్రపంచంలోనే అతి పెద్దదని కేసీఆర్ రామస్వామితో అన్నారు. ఈ పథకం గురించి ప్రజలకు తెలియజేయాలని ఆయన రామస్వామికి సూచించారు.