కేసీఆర్ కు 100 కు 100, 91, 90, 84 మార్కులు... ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్.. 

తెలంగాణ ఏర్పాటుతర్వాత గత పదేళ్లు రాష్ట్రాన్ని బిఆర్ఎస్ పార్టీయే పాలించింది. ఇలా కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రగతి ఎలా వుందో తెలియజేసేలా నీతి ఆయోగ్ ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో కేసీఆర్ పాలనకు ఎన్ని మార్కులు వచ్చాయంటే....

KCR Scores High in NITI Aayog sustainable development Rankings: Telangana Achieves All India Second Rank AKP

Kalvakuntla Chandrashekar Rao : గత పదేళ్ళు భారత రాష్ట్ర సమితి అద్భుత పాలన అందించిందని... కానీ ప్రజలకు, తమకు చిన్న గ్యాప్ రావడంవల్లే అధికారం కోల్పోయామని ఇటీవలే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పాలనలోనే ప్రతి రంగంలోనూ రాష్ట్రం ప్రగతి సాధించిందని బిఆర్ఎస్ నాయకులు చెబుతుంటారు. అయితే నిజంగానే బిఆర్ఎస్ పాలనలో ఆ స్థాయి అభివృద్ది జరిగిందా..? ముఖ్యమంత్రిగా కేసీఆర్ అంత బాగా పనిచేసారా..? అంటే అవుననే చెబుతున్నాయి నీతి ఆయోగ్ లెక్కలు. 

తాజాగా నీతి ఆయోగ్ దేశంలోని అన్ని రాష్ట్రాలు వివిధ రంగాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. రంగాలవారిగా రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఇందులో పేదరిక నిర్మూలన విషయంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఇక మిగతా రంగాల్లోనూ తెలంగాణ మంచి స్థానంలోనే నిలిచింది. ఇలా నీతి ఆయోగ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ (ఎస్‌డీజీ) 2023-24 నివేదికను విడుదల చేసింది. 

ఆర్థిక, సామాజిక, పర్యావరణ, పేదరిక నిర్మూలన, వైద్యం... ఇలా 16 అంశాల్లో దేశం, రాష్ట్రాల పరిస్థితిని అంచనా వేస్తూ సుస్థిర అభివృద్ది లక్ష్యాల ఇండెక్స్ ను రూపొందించింది నీతిఆయోగ్. దీని ప్రకారం పేదరిక నిర్మూలనలో  తెలంగాణ 91 స్కోరుతో రెండోస్థానంలో నిలిచింది. 

తక్కువ ధరలో క్లీన్ ఎనర్జీని అందించటంలో తెలంగాణ 100/100 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించడంలో 100 కు 90, ఆర్థిక అభివృద్దిలో 84 స్కోరు సాధించింది. మొత్తంగా సుస్థిరాభివృద్దిలో తెలంగాణ 75 స్కోరుతో ఆరో స్థానంలో నిలిచింది. ఇలా నీతి ఆయోగ్ విడుదల చేసిన వివరాలను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేసారు. 

 

కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్దిలో పరుగులు పెట్టిందనేందుకు నీతి ఆయోగ్ లెక్కలే నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. గత పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రజారంజక పాలన అందించబట్టే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. తెలంగాణ ప్రగతిని గతంలోనే కేంద్ర సంస్థలు అనేకమార్లు ప్రశంసించాయని... ఇప్పుడు నీతి ఆయోగ్ మరోసారి అలాంటి నివేదికే ఇచ్చిందన్నారు. చాలా రంగాల్లో దేశ సగటు కంటే తెలంగాణ స్కోరు బాగుందని... ఇదే రాష్ట్ర అభివృద్దిని తెలియజేస్తోందన్నారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రయత్నించామని... ఆ దిశగా విజయం కూడా సాధించామన్నారు. 

కేసీఆర్ విజన్, సాహసోపేత నిర్ణయాల వల్లే తెలంగాణ అభివృద్ధి ఇంత వేగంగా జరిగిందని కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మెరుగైన స్థితికి చేర్చిందని... ఈ ప్రభుత్వం కూడా ఆ స్ఫూర్తిని కొనసాగించాలని కేటీఆర్ సూచించారు. ప్రతీకారాలు, రాజకీయ కక్షలు, పార్టీ ఫిరాయింపులపై పెట్టే దృష్టి... రాష్ట్ర అభివృద్ధిపై పెడితే ప్రజలకు మేలు జరుగుతుందంటూ రేవంత్ సర్కార్ కు కేటీఆర్ చురకలు అంటించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios