కేసీఆర్ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ప్రస్తుతం రవి, శుక్ర, శని, గురు, కుజులు ఆయనకు అనుకూలంగా ఉన్నారు. వీరికి తోడు చంద్రుడు, రాహువు, కేతువు దశలు కూడా కేసీఆర్‌కు రాజయోగాన్నిస్తున్నారు. 

అమరావతి: కేసీఆర్ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ప్రస్తుతం రవి, శుక్ర, శని, గురు, కుజులు ఆయనకు అనుకూలంగా ఉన్నారు. వీరికి తోడు చంద్రుడు, రాహువు, కేతువు దశలు కూడా కేసీఆర్‌కు రాజయోగాన్నిస్తున్నారు. 

ఇటువంటి జాతకం 100 కోట్ల మందిలో ఒకరికి ఉంటుందని.. ప్రాచీన కాలంలో భారతదేశాన్ని పాలించిన విక్రమాదిత్యుని జాతకంలో ఇలాంటి గ్రహగతులే ఉండేవని వేదపండితులు చెబుతున్నారు. 

ప్రముఖ జ్యోతిష్యవేత్త రమణారావు అభిప్రాయం ప్రకారం.. కేసీఆర్ సమీపకాలంలో భారతదేశానికి ప్రధాని కాగలరని... అందుకు సంబంధించిన దశ ప్రస్తుతం నడుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. 

2009లో తెలంగాణ భవన్‌లో కేసీఆర్ నిర్వహించిన అపూర్వ చంఢీయాగం రమణారావు సారథ్యంలోనే జరిగింది. ఆ సమయంలో గ్రహగతులు బాలేదని, హెలికాఫ్టర్‌లో వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌కు ఆయన సూచించారు.

ఇది చెప్పింది సీఎం రెండోసారి సీఎం అయిన తర్వాత కాదు. తెలంగాణ శాసన సభను కేసీఆర్ రద్దు చేసిన రెండోరోజు మాండ్రు నారాయణ రమణరావు చెప్పిన జ్యోతిష్యం ఇది. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చెప్పినట్లే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది. 

అంతేకాదు ముఖ్యమంత్రిగా రెండో సారి ప్రమాణ స్వీకారం కూడా చెయ్యబోతున్నారు. అలాగే జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. అచ్చం మాండ్రు నారాయణ రావు చెప్పినట్లే జరగడంతో అంతా వావ్ అంటున్నారు.