ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు సమావేశమయ్యారు. ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా కేసీఆర్ ఫడ్నవీస్ ను ఆహ్వానించారు

శుక్రవారం నాడు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో తెలంగాణ సీఎం కేసీఆర్  ముంబై వెళ్లారు. తొలుత మహరాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును కేసీఆర్ కలిశారు. కాళేశ్వరం  ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా విద్యాసాగర్ రావును ఆయన ఆహ్వానించారు.

మరో వైపు మహారాష్ట్ర సీఎంతో కూడ కేసీఆర్ భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపనకు ముందు కేసీఆర్ మహరాష్ట్రతో ఒప్పందం చేసుకొన్నారు.

ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా కేసీఆర్ ఫడ్నవీస్ ను ఆహ్వానించారు. ఈ నెల 17 వతేదీన ఏపీ సీఎం జగన్ ను కూడ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేసీఆర్ ఆహ్వానించనున్నారు.