ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్ లోని మోదీ నివాసంలో ఆయనను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీని కలవడం ఇదే తొలిసారి.

ఈ సందర్భంగా కేసీఆర్ విభజన హామీలు అమలు చెయ్యాలని పీఎంను కోరారు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు రూ.1000 కోట్లు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. దీంతోపాటు కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చెయ్యాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

వీడియో

"