హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు మధ్యాహ్నం ప్రగతి భవన్ లో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు సీఎం. రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

రెండు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులను టీఆర్ఎస్ ప్రకటించింది. ఈ ఎన్నికల ప్రచారంపై వ్యూహారచన చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలపై కూడ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడ ఖరారు చేసే అవకాశం ఉంది. 

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ స్థానానికి పోటీ చేసే అభ్యర్ధిని టీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయమై మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలను కూడ టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది.ఈ ఫలితాలు టీఆర్ఎస్, కాంగ్రెస్ కు షాకిచ్చాయి.