హైదరాబాద్: తెలంగాణ సీఎం  కేసీఆర్ ఆదివారం నాడు సాయంత్రం చెన్నై బయలుదేరి వెళ్లారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై  డీఎంకె చీఫ్ స్టాలిన్‌తో సమావేశం కానున్నారు.

ఇవాళ సీఎం కేసీఆర్ శ్రీరంగం దేవాలయాన్ని సందర్శించే అవకాశం ఉంది. సోమవారం నాడు కేసీఆర్ డీఎంకె చీఫ్ స్టాలిన్‌తో సమావేశం కానున్నారు.

కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ ఎంపీ కేకే కూడ వెళ్లే అవకాశం ఉందని సమాచారం. సోమవారం నాడు డీఎంకె చీఫ్ స్టాలిన్‌తో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చించనున్నారు. గత వారంలో కేరళ సీఎం విజయన్‌తో ఇదే విషయమై కేసీఆర్ చర్చించారు.