కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు
హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. కరీంనగర్ ఎన్నికల సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రికి ఈసీ కేసీఆర్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.
Add Asianetnews Telugu as a Preferred Source

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను శుక్రవారం సాయంత్రం లోపుగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో శుక్రవారం నాడు ఉదయమే కేసీఆర్ తన వివరణను ఈసీకి అందించారు. ఈ మేరకు వివరణతో కూడిన ప్రతిని రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతిబుద్దప్రకాష్‌కు టీఆర్ఎస్ నేతలు అందించారు.
