తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మరోసారి విజయ ఢంకా మోగించారు. వరసగా రెండో సారి ఆయన ముఖ్యమంత్రి పదవిని అలంకరించబోతున్నారు.ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. అయితే.. ఆయన అధికారంలోకి రావడంతో.. తెలంగాణలోని ఆయన అభిమానులు, కార్యకర్తలతోపాటు.. ఏపీలోని ఆయన అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు ఇప్పటికే.. సంబరాలు జరుపుకున్నారు.

కొందరు.. స్వీట్లు పంపిణీ చేశారు. మరికొందరు.. ప్రకాశం జిల్లా ఒంగోలులో జాతీయ రహదారిపై కేసీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీ జెండాలను కూడా కట్టారు. అయితే.. దీనిపై ఒంగోలు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా పార్టీ జెండాలు కట్టారంటూ.. ఆ జెండాలు కట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా.. ఆ జెండాలన్నింటినీ పీకేశారు.