హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రెండు రికార్డులు సృష్టించారు. ఒక్కటి తన వ్యక్తిగత రికార్డు కాగా, రెండోది పార్టీకి చెందింది. 

శానససభకు 8వ సారి ఎన్నికైన రికార్డును కేసిఆర్ సొంతం చేసుకున్నారు. అయితే, నాగార్జునసాగర్ లో ఓటమి పాలు కావడం ద్వారా కాంగ్రెసు సీనియర్ నేత కె. జానారెడ్డి ఆ రికార్డును మిస్సయ్యారు. అప్రతిహతంగా ఎనిమిదో సారి గెలిచిన ఎమ్మెల్యే శాసనసభలో కేసీఆర్ ఒక్కరే కానున్నారు. 

ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లి కూడా విజయం సాధించిన నేతగా కేసిఆర్ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపి రెండుసార్లు ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓటమిపాలైంది. 

కేసిఆర్ 9 నెలలు ముందుగా శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాలు గెలుచుకోగా, ఈసారి 88 సీట్లను సొంతం చేసుకుంది. 

హరీష్ రావుతో పాటు ఇతర మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు.