తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడింది. రేపే తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కి సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా.. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. మెదక్ జిల్లా సిద్ధిపేటలోని చింతమడక గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కేసీఆర్ ఓటు వేసే పోలింగ్ బూత్ ను, హెలిప్యాడ్ స్థలాలను పోలీసు కమిషనర్ జోయెల్ డేవిస్ ఇవాళ పరిశీలించారు. చింతమడకలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని అధికారులు తరలిస్తున్నారు.