హైదరాబాద్: తాను మంత్రివర్గంలోకి తీసుకునే వారి పేర్లను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హరీష్ రావును, కేటీ రామారావును పక్కన పెడుతూ మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది.

రేపు మంగళవారం కెసిఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కేవారిపై టీఆర్ఎస్‌ మీడియా ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. హరీష్ రావు, కేటీఆర్ లకే కాకుండా ఈటల రాజేందర్ ను కూడా కేసీఆర్ పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది.
 
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు, చీఫ్ విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్‌ పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి మంత్రి వర్గం విస్తరణ ఉంటుందని సమాచారం. 
 
మంత్రివర్గంలో చోటు దక్కేవారు వీరే...

హైదరాబాద్ : తలసాని శ్రీనివాస్ యాదవ్
ఆదిలాబాద్: ఇంద్రకరణ్‌రెడ్డి
కరీంనగర్ : కొప్పుల ఈశ్వర్
వరంగల్ : ఎర్రబెల్లి దయాకర్ రావు
నల్గొండ : జగదీష్‌రెడ్డి
నిజామాబాద్ : ప్రశాంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్ : నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌