Asianet News TeluguAsianet News Telugu

ముందస్తు సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన కేసీఆర్

ఇప్పటి వరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లినవారు ఎవ్వరూ విజయం సాధించలేదు అనే ఓ సెంటిమెంట్ ఉండేది.

kcr breaks early elections sentiment in telangana elections
Author
Hyderabad, First Published Dec 11, 2018, 10:53 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో.. టీఆర్ఎస్ పార్టీ గెలుపు దాదాపు ఖరారైంది. దాదాపు 90 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం డిక్లేర్ అయిపోయింది. దీంతో.. ముందస్తు సెంటిమెంట్ కి కేసీఆర్ బ్రేకులు వేసినట్లే అనిపిస్తోంది.

ఇప్పటి వరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లినవారు ఎవ్వరూ విజయం సాధించలేదు అనే ఓ సెంటిమెంట్ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు 2003లో శాసనసభను ముందుగానే రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల నిర్వహణకు కమిషన్ మార్చి వరకు సమయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుపై ఓడిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ముందస్తు ఎన్నికలు పాలక పార్టీకి కలిసి రావడం లేదనే సెంటిమెంట్ ఉంది.  అయితే.. ఈ సెంటిమెంట్ ని కేసీఆర్ అధిగమించారు. ఈ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు.

ఇది మాత్రమే కాదు.. మరో సెంటిమెంట్ ని కూడా కేసీఆర్ ఈ ఎన్నికల్లో బ్రేకులు వేశారు. అదేదంటంటే.. గజ్వెల్ లో ఒక్కసారి గెలిచిన అభ్యర్థి రెండోసారి గెలువలేదు. 1978 నుంచి ఇదే పరిస్థితి. 1978లో సైదయ్య అల్లం సాయిలుపై విజయం సాధించారు. 1983 ఎన్నికలకు వస్తే సాయిలు సైదయ్యపై విజయం సాధించారు. ఆ విధంగా చూస్తే కాంగ్రెసు సీనియర్ నేత జె. గీతారెడ్డికి కూడా ఓటమి తప్పలేదు.

2009లో తూముకుంట నర్సారెడ్డి గజ్వెల్ లో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో నర్సారెడ్డి ఓడిపోయి కేసీఆర్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మహా కూటమి నుంచి కేసీఆర్ తో వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. అయితే.. ఇక్కడ కూడా కేసీఆర్ విజయం దాదాపు ఖరారైంది. దాదాపు 15వేల ఓట్ల తేడాతో కేసీఆర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios