షాక్: టీడీపీకి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని రాజీనామా

టీడీపీకి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి  కాసాని జ్ఞానేశ్వర్  రాజీనామా చేశారు.

kasani gnaneshwar Resigns To TDP lns


హైదరాబాద్:టీడీపీకి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ సోమవారంనాడు రాజీనామా చేశారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో  కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నెల  28న  కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ చీఫ్ చంద్రబాబుతో  భేటీ అయ్యారు.

 తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన  పరిస్థితులను  చంద్రబాబు వివరించారు.  పార్టీ నిర్ణయాన్ని కాసాని జ్ఞానేశ్వర్ నేతలకు వివరించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నేతలు  కోరారు. అయితే  ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో పోటీ చేయలేమని  పార్టీ తేల్చడంతో కాసాని జ్ఞానేశ్వర్ ఇవాళ రాజీనామా చేశారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తొలుత టీడీపీ భావించింది.  అభ్యర్ధుల ఎంపికపై కూడ  కసరత్తును రాష్ట్ర కమిటీ ప్రారంభించింది. అయితే చంద్రబాబు ఇంకా జైలులోనే ఉండడంతో  తెలంగాణపై  ఫోకస్ చేయలేమని చంద్రబాబు కాసాని జ్ఞానేశ్వర్ కు తేల్చి చెప్పారు.  తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించి ఆ తర్వాత  వెనక్కి తగ్గడంతో  కాసాని జ్ఞానేశ్వర్ అసంతృప్తికి గురయ్యారు.

కాసాని జ్ఞానేశ్వర్  టీడీపీని వీడుతారనే  ప్రచారం కూడ కొన్ని రోజులుగా సాగుతుంది.  బీఆర్ఎస్ లో కాసాని జ్ఞానేశ్వర్  చేరే అవకాశం ఉందని ప్రచారం కూడ లేకపోలేదు.  రెండు రోజుల్లో తన కార్యాచరణను ప్రకటించనున్నట్టుగా  కాసాని జ్ఞానేశ్వర్  ప్రకటించారు. 

also read:చంద్రబాబుకు షాక్: మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులంటూ అభియోగాలు, కేసు

తెలంగాణ ఎన్నికల్లో  బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి.ఈ రెండు పార్టీల మధ్య  సీట్ల పంపకంపై  నవంబర్  1న స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  తెలంగాణలో  టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios