Asianet News TeluguAsianet News Telugu

కార్వీ కేసులో కీలక విషయాలు: విచారణలో రాబట్టిన పోలీసులు


బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపు ఆరోపణల కేసులో కార్వీ ఎండీ పార్ధసారథిని మరో రెండు రోజుల పాటు సీసీఎస్ పోలీసులు విచారించనున్నారు.ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కొంత కీలక సమాచారాన్ని సేకరించారు. మరో రెండు రోజుల విచారణలో మరింత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందని సమాచారం.

Karvy MD parthasarathi reveals key information in police investigation
Author
Hyderabad, First Published Aug 29, 2021, 3:55 PM IST

హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపు ఆరోపణల కేసులో కార్వీ ఎండీ పార్ధసారధి నుండి సీసీఎస్ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారని సమాచారం.  రెండు రోజుల పాటు కార్వీ ఎండీ పార్ధసారథిని సీసీఎస్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు.

also read:కార్వీలో అక్రమాలు.. జనానికి మొత్తం రూ.780 కోట్ల కుచ్చుటోపీ, మరోసారి సీసీఎస్ కస్టడీకి పార్థసారథి

 కస్టమర్ల షేర్లను కార్వీ ఎండీ పార్ధసారథి తాకట్టు పెట్టి తన స్వంత ఖాతాల్లోకి నిధులను మళ్లించినట్టుగా  పోలీసులు గుర్తించారు. రూ. 780 కోట్లను నేరుగా ఖాతాదారులకు మోసం చేశారని గుర్తించారు. రూ. 720 కోట్ల షేర్లను తనఖా పెట్టి బ్యాంకుల నుండి రుణం పొందారని సమాచారం. షేర్లను తనఖా పెట్టి రూ. 1200 కోట్లను బ్యాంకులకు రుణం చెల్లించకుండా ఎగవేశాడు.  

ఇతర రాష్ట్రాల్లో కూడ కార్వీ సంస్థ ఎండీ పార్ధసారథిపై కేసులు నమోదయ్యాయి.ఈ  కేసులపై కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. రియల్ ఏస్టేట్, సాప్ట్‌టెక్ కంపెనీల్లో  పెట్టుబడులు పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ రెండు కంపెనీల్లో నిధులు లేవని పోలీసులు  తమ దర్యాప్తులో తేల్చారు. ఈ నిధులను ఎక్కడికి తరలించారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఇప్పటికే రెండు రోజుల కస్టడీ ముగిసింది. అయితే కీలక సమాచారం రాబట్టేందుకు మరో రెండు రోజుల పాటు కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథిని పోలీసులు తీసుకోనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios