కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారథిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకుల నుంచి రూ.1,200 కోట్ల రుణాలు తీసుకున్నారు పార్థసారథి. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి రూ.730 కోట్లు, ఇండస్ ఇండ్ నుంచి రూ.340 కోట్లు, మరో బ్యాంక్ నుంచి రూ.147 కోట్ల రుణాలను తీసుకున్నారు. 

కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారథిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకుల నుంచి రూ.1,200 కోట్ల రుణాలు తీసుకున్నారు పార్థసారథి. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి రూ.730 కోట్లు, ఇండస్ ఇండ్ నుంచి రూ.340 కోట్లు, మరో బ్యాంక్ నుంచి రూ.147 కోట్ల రుణాలను తీసుకున్నారు. ఈ మూడు బ్యాంకుల ఫిర్యాదుతో పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా కార్వీ కన్సల్టెన్సీపై సెబీ పలు రకాల ఆంక్షలు విధించింది.