అంబానీ ఇంట పెళ్లిలో కరీంనగర్ ఉత్పత్తులు.. అతిథులకు తెలంగాణ నుంచే అదిరిపోయే రిటర్న్ గిఫ్టులు..
Karimnagar Silver Filigree: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(అనంత్ - రాధిక)ల వివాహ వేడుకలు షూరు అయ్యాయి. ఈ పెళ్లికి వచ్చే అతిథులకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వనున్నారు. ఆ రిటర్న్ గిఫ్ట్స్ ను మన కరీంనగర్ లో తయారు చేయిస్తున్నారంట. ఇంతకీ ఆ ప్రత్యేక బహుతులేంటో తెలుసా?
Karimnagar Silver Filigree: రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (అనంత్ రాధిక)ల వివాహ వేడుకలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జూలైలో జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహానికి హాజరయ్యే గ్లోబల్ ఎ-లిస్టర్‌లకు అంబానీ కుటుంబం బహుమతిగా ఇచ్చేందుకు అద్భుతమైన బహుమతుల జాబితాలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) ట్యాగ్ చేసిన కరీంనగర్ వెండి కళాఖండాలు చేరనున్నాయి.
ఈ ఏడాది మార్చిలో జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకకు బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, హిల్లరీ క్లింటన్, రిహన్న వంటి ప్రముఖులు హాజరయ్యారు.
కరీంనగర్ హస్తకళల సంక్షేమ సంఘం (SIFCA) సిల్వర్ ఫిలిగ్రీ ఈ హైప్రొఫైల్ వివాహానికి సంబంధించి దాదాపు 400 విలువైన కళాఖండాల కోసం ఆర్డర్‌ను అందుకుంది. అందులో నగల పెట్టెలు, పర్సులు, ట్రేలు, పండ్ల గిన్నెలు మొదలైనవి ఉన్నాయని SIFCA ప్రెసిడెంట్ ఆరోజు అశోక్ తెలిపారు.
అంబానీ పెళ్లి దాదాపు 400 ఏళ్ల నాటి ఈ పురాతన కళలకు పెద్ద ప్రచారం అవుతుందని, ఆయన క్రియేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు, ప్రసిద్ధుల ఇళ్లకు చేరుకుంటాయని అశోక్ చెప్పారు. నవంబర్ 2023లో హైదరాబాద్‌లో అరంగేట్రం చేసిన రిలయన్స్ రిటైల్ స్వదేశ్ స్టోర్‌కు SIFCA సరఫరా చేస్తోందని ఆయన చెప్పారు.