Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డి మాస్టర్ ప్లాన్: అడ్లూరు ఎల్లారెడ్డి సర్పంచ్ పై దాడి, రాజీనామాకు డిమాండ్


 కామారెడ్డి జిల్లాలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ సర్పంచ్ పై  రైతులు ఇవాళ దాడికి దిగారు.  పదవికి రాజీనామా చేయాలని సర్పంచ్ పై  రైతులు దాడి చేశారు.

 Kamareddy New Master Plan:Farmers  Attacked  on Adloor  Yellareddy Sarpanch
Author
First Published Jan 5, 2023, 3:23 PM IST

కామారెడ్డి: జిల్లాలోని అడ్లూరు  ఎల్లారెడ్డి గ్రామ సర్పంచ్ పై  రైతులు గురువారంనాడు దాడి చేశారు. సర్పంచ్ పదవికి రాజీనామా చేయాలని  డిమాండ్  చేస్తున్నారు. ఇప్పటికే  ఇదే గ్రామానికి చెందిన  ఉప సర్పంచ్ సహా  తొమ్మిది వార్డు సభ్యులు  తమ పదవులకు  రాజీనామా చేశారు. తమ భూములను పరిశ్రమల కోసం  తీసుకుంటన్నారనే ఆవేదనతో రాములు అనే రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు.రాములు ఆత్మహత్యతో  అడ్లూరు  ఎల్లారెడ్డికి చెందిన  సర్పంచ్ కూడా రాజీనామా చేయాలని  రైతులు ఆయనపై దాడికి దిగారు.  మాస్టర్ ప్లాన్  కు అవసరమైన  భూమిని ఐదు గ్రామాల రైతులనుండి తీసుకునేందుకు  ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రైతులు చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్ ను వెనక్కు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  ఐదు గ్రామాల రైతులు తమ కుటుంబ సభ్యులతో  ఇవాళ కలెక్టరేట్  ముందు  ఆందోళనకు దిగారు.  ఈ ఆ:దోళనలకు  బీజేపీ, కాంగ్రెస్ నేతలు మద్దతు ప్రకటించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios