NTR Jayanthi : తాత సమాధి సాక్షిగా ...జూ.ఎన్టీఆర్ సీఎం నినాదాలు... 

తాత నందమూరి తారక రామారావు సమాధి సాక్షిగా జూ.ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాాలన్న కోొరికను ఫ్యాన్స్ బయటపెట్టారు. జూ.ఎన్టీఆర్ తాత సమాధివద్ద వున్నంతసేపు సీఎం నినాదాలు మారుమోగాయి.

Junior NTR and Kalyan Ram pay tribute on Grand father NTR birth Anniversary AKP

హైదరాబాద్ : సినీ నటుడిగానే కాదు రాజకీయ నాయకుడిగానూ తెలుగు ప్రజల గుండెల్లో చోటు దక్కించుకున్నారు నందమూరి తారక రామారావు. ఇవాళ ఆయన 101వ పుట్టినరోజు. దీంతో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి నెలకొంది. ఆయన కుటుంబసభ్యులతో పాటు టిడిపి  నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ కు నివాళి అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 

ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కలిసి ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. అయితే తమ అభిమాన నటుడు ఈరోజు తాతకు నివాళి అర్పించేందుకు వస్తాడని జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు తెలుసు. దీంతో ఉదయమే వారు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇలా జూ.ఎన్టీఆర్ వచ్చిన సమయంలో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. 

ఇక సోదరుడు కల్యాణ్ రామ్  తో కలిసి తాత సమాధి వద్ద ఎన్టీఆర్ నివాళులు అర్పిస్తుండగా సీఎం... సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేసారు. ఇలా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్ వున్నంతసేపు ఈ నినాదం మారుమోగుతూనే వుంది. ఇలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీఎం నినాదాలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. 

 

ఇదిలావుంటే తండ్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి కూడా నివాళి అర్పించారు. ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నందమూరి ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ ఘాటు సందడిగా మారింది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios