Asianet News TeluguAsianet News Telugu

ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్‌మీట్‌ను బహిష్కరించిన జర్నలిస్టులు

తన పెద్దపల్లి పర్యటనలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జర్నలిస్టులకు చుక్కలు చూపించారు  దాంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని జర్నలిస్టులు బహిష్కరించారు.

Journalists boycott Uttam Kumar Reddy press meet
Author
Peddapalli, First Published Feb 27, 2021, 2:07 PM IST

పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ జర్నలిస్టులకు చుక్కలు చూపించారు. దీంతో జర్నలిస్టులంతా ఆయన ప్రెస్ మీట్‌ను బహిష్కంరించి వెళ్లిపోయారు. ఈ నెల 17న దారుణ హత్యకు గురైన హైకోర్టు అడ్వకేట్లు గట్టు వామన్ రావు, పీవీ నాగమణిల కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం వచ్చారు. ముందుగా ఎన్టీపీసీలోని మిలినియం హాల్లో ప్రెస్ మీట్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు సమాచారం ఇచ్చాయి.

ఉదయం 9.30 గంటలకు మీడియా సమావేశం ఉంటుందని చెప్పడంతో జర్నలిస్టులు మిలినియం హాల్ వద్ద 11.30 వరకు పడిగాపులు కాచారు. హైదరాబాద్ నుంచి ఎన్టీపీసీ గెస్ట్ హౌజ్‌కు చేరుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మిలీనియం బ్లాక్ కు మాత్రం చేరలేదు. 

దీంతో రెండు గంటల పాటు ప్రెస్ మీట్ కోసం ఎదురుచూసి విసిగి వేసారిన మీడియా ప్రతినిధులు అక్కడి నుండి వెళ్లిపోయారు. జూమ్ మీటింగ్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారని ఇంకా లేటవుందని తెలుసుకున్న జర్నలిస్టులు తిరిగి వెళ్లిపోయారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఒక్కరు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మిలినియం హాల్ పరిసరాల్లో కూడా కనిపించడకపోవడం, సమాచారం కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో జర్నలిస్టులు మండిపడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios