జగిత్యాల: దేవీ శరన్నవత్రుల సందర్భంగా ఊరువాడ అంతా సంబంరంగా ఉంటే ఆ ఇంట్లో మాత్రం విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. పండుగపూట కుటంబ సభ్యులతో గడపాలని భావించిన రైతులు వేకువ జామునే పొలానికి వెళ్లిన వారు శాశ్వతంగా వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో రోదనలు అన్నీ ఇన్నీ కావు. 

వివరాల్లోకి వెళ్తే వెల్గటూర్ మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. గుర్రం అజయ్ రెడ్డి, ముస్కు రాజిరెడ్డిలు పొలానికి మోటార్ పెట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. 

తమకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందర్నీ కలచి వేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విద్యుత్ షాక్ తోనే మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో నిర్థారించారు.