Asianet News TeluguAsianet News Telugu

నిన్న మొన్న వచ్చినవారికి మంత్రి పదవులు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

పార్టీలో నిన్నా, మొన్నా వచ్చిన వారికి మంత్రిపదవులు అంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ‘టీఆర్ఎస్ లో నేను కొన్నేళ్లుగా ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను. పార్టీలో నిన్నా, మొన్నా వచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చినా ఎలాంటి గొడవ పడలేదు. సీఎం కేసీఆర్, కార్యకర్తలు, నేతలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చి ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతారు’ అన అన్నారు. 

jangaon mla muthireddy yadagiri reddy comments on minister posts - bsb
Author
Hyderabad, First Published Feb 19, 2021, 9:49 AM IST

పార్టీలో నిన్నా, మొన్నా వచ్చిన వారికి మంత్రిపదవులు అంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ‘టీఆర్ఎస్ లో నేను కొన్నేళ్లుగా ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను. పార్టీలో నిన్నా, మొన్నా వచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చినా ఎలాంటి గొడవ పడలేదు. సీఎం కేసీఆర్, కార్యకర్తలు, నేతలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చి ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతారు’ అన అన్నారు. 

జనగామలో గురువారం మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితతో కలిసి నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదును ముత్తిరెడ్డి ప్రారంభించారు. ఆ తరువాత మాట్లాడుతూ ‘టీఆర్ఎస్ లో కార్యకర్తలకు సముచితమైన ప్రాధాన్యం ఉంటుందని, అధిష్టానం ఆ మేరకు అన్ని చర్యలు తీసుకుంటుందని, కార్యకర్తలు సూచించిన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పుకొచ్చారు. 

గ్రామాలు, పట్టణాలలో ఇకపై పార్టీ కార్యకర్తలు సూచించిన వారికే ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల మంజూరు జరుగుతుందన్నారు. తాను కూడా కార్యకర్తల ప్రాధాన్యం కోసం ఇదే పద్ధతిని అవలింభిస్తానని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకూ టీఆర్‌ఎస్‌ పార్టీ బతికే ఉంటుందని, రెండు దశాబ్దాల తరువాత కేసీఆర్‌ తదనంతరం సీఎం పగ్గాలు చేపట్టేందుకు పార్టీలో సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios