కరోనా కరాళ నృత్యానికి ప్రపంచమంతా విలవిల్లాడిపోతోంది. అన్ని దేశాలు, ప్రజలు కుల మత వర్ణ బేధాలు లేకుండా చివురుటాకుల్లా వణికి[పోతున్నారు. ప్రభుత్వాలన్నీ ఇంకా మందు కూడా లేని ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ప్రజల కదలికలపై ఆంక్షలువై విధిస్తు తమ పరిధిలోని చర్యలన్నింటిని చేయగలిగినంత మేర చేస్తుంది. 

భారతదేశంపై కూడా కరోనా పంజా బలంగా పడింది. ఇప్పటికే ఒకరకంగా భారతదేశమంతటా షట్ డౌన్ వాతావరణం కనబడుతుంది. కరోనా మహమ్మారి దెబ్బకు కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలెర్ట్ అయ్యాయి. 

ఇక భారతప్రధాని నరేంద్ర మోడీ కూడా రేపు ఆదివారం నాడు కరోనా వైరస్  ప్రభావాన్ని తగ్గించేందుకు సోషల్ డిస్టెంసింగ్ ను పాటించడం కోసం జనతా కర్ఫ్యూ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

ఆయన ఇలా పిలుపునివ్వడంతోపాటు రేపు సాయియంత్రం 5 గంటలకు దేశంలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ... వారికి అభినందనలు తెలుపుతూ ఒక రెండు నిమిషాలపాటు చప్పట్లు కొట్టమని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. 

ఇక ఇలా ప్రధాని చప్పట్లు కొట్టమని పిలుపునివ్వడంతో కొద్దీ మంది సోషల్ మీడియాలో ప్రధానిని సైతం అవహేళన పరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలా ప్రధానిని అవహేళన పరుస్తున్న వారిని అరెస్టు చేయాలనీ ముఖ్యమంత్రి కేసీఆర్ డీజీపీ ని ఆదేశించారు. 

ఇకపోతే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్యా రోజు రోజుకి పెరిగిపోతుంది. దేశంలో 258 కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్ర ఎక్కువగా కరోనావైరస్ వ్యాప్తికి గురైనట్లుకనిపిస్తోంది. ఆ తర్వాత స్థానం కేరళ ఆక్రమిస్తోంది. విదేశాల నుంచి ముంబైకి ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చే అవకాశం ఉండడం వల్ల కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు భావించవచ్చు. 

గల్ఫ్ నుంచి కేరళకు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. దీంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు భావించవచ్చు.

మహారాష్ట్రలో 52 కేసులు నమోదు కాగా, కేరళలో 40 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యఅంతకంతకూ పెరుగుతున్నాయి. హిమాచల్ లో మొదటి కరోనా కేసు నమోదైంది. మధ్యప్రదేశ్, గుజరాత్ ల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.