తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : 8 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన జనసేన.. లిస్ట్ ఇదే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. మంగళవారం 8 స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. మంగళవారం 8 స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది.
జనసేన అభ్యర్ధులు వీరే :
- కూకట్‌పల్లి - ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్
- కొత్తగూడెం - లక్కినేని సురేందర్ రావు
- వైరా (ఎస్టీ) - డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్
- తాండూరు - నేమూరి శంకర్ గౌడ్
- కోదాడ - మేకల సతీష్ రెడ్డి
- అశ్వారావుపేట (ఎస్టీ) - ముయబోయిన ఉమాదేవి
- నాగర్ కర్నూలు - వంగ లక్ష్మణ్ గౌడ్
- ఖమ్మం - మిర్యాల రామకృష్ణ
కాగా.. గత కొద్దీ రోజులుగా (చంద్రబాబు అరెస్ట్ అనంతరం) ఏపీలో పవన్ కళ్యాణ్ పవర్ పాలిటిక్స్ ఫ్లే చేశారు. టీడీపీకు అండగా నిలిచి అందరి ద్రుష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. ఆంధ్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. కానీ, తెలంగాణలో ఎన్నికల్లో సైకిల్ పోటీ నుంచి తప్పుకోవడంతో జనసేనాని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనివార్యంగా మారింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ఈ అసెంబ్లీ పోరులో గులాబీ దళాన్ని కాషాయసేనతో జనసేనాని ఎలా ఎదుర్కొబోతున్నాడు అనే అసలు ప్రశ్న.
వాస్తవానికి కొద్ది రోజులుగా తెలంగాణలో తాము పోటీ చేస్తామని జనసేన మొదటి నుంచి చెపుతూ వస్తోంది. బీజేపీ అధిష్టానం కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్టు .. కేసీఆర్ ను ఓడించాలంటే పొత్తు అవసరమని, అలాగే.. కాంగ్రెస్ ని జనాలకు దరికి చేరకుండా చేయాలని యోచిస్తున్న తరుణంలో బీజేపీకి జనసేన రూపంలో ఓ తోడు దొరికింది. అయితే.. జనసేనతో జట్టు కట్టడం బిజెపికి లాభమా ? నష్టమా? ఇప్పుడు ఇదే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఇదిలాఉంటే.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ కాలుమోపనున్నారు. రాష్ట్రం నడిబొడ్డున నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత జరుగనున్న భారీ బహిరంగ సభ కావడం. ఈ సభలో ప్రధాని మోడీతో కలిసి జనసేన అని పవన్ కళ్యాణ్ వేదికను పంచుకోవడంతో ఈ సభకు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఈ సభలో ప్రధాని మోడీ.. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తే.. మరీ జనసేనాని ఎవర్ని టార్గెట్ చేస్తారు. ఏ అంశాలను లేవనెత్తుతారు. అనేది మరో ప్రశ్న..