వనమాపై అనర్హత వేటు:తెలంగాణ సీఈఓ వికాస్‌రాజ్‌కు హైకోర్టు తీర్పు కాపీ అందించిన జలగం


కొత్తగూడెం అసెంబ్లీ ఫలితంపై  ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తో  జలగం వెంకటరావు  ఇవాళ భేటీ అయ్యారు.  హైకోర్టు తీర్పు కాపీని అందించారు.

Jalagam Venkat Rao  Submits  Telangana High Court  Verdict Copy to Telangana CEO on  kothagudem MLA Election Result lns

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  వికాస్ రాజ్ తో బుధవారంనాడు  జలగం వెంకటరావు  భేటీ అయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యే  ఎన్నిక విషయంలో  హైకోర్టు ఇచ్చిన  తీర్పు కాపీని వికాస్ రాజ్ కు అందించారు. 2018 నుండి  కొత్తగూడెం  ఎమ్మెల్యేగా  జలగం వెంకటరావును  గుర్తించాలని  తెలంగాణ హైకోర్టు ఈ నెల  25న ఆదేశాలు జారీ చేసింది.ఈ కోర్టు తీర్పు కాపీని ఇవాళ  తెలంగాణ అసెంబ్లీ  స్పీకర్ , తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీకి జలగం వెంకటరావు అందించారు.  

తెలంగాణ రాష్ట్ర ఎన్నికలప్రధానాధికారి వికాస్ రాజ్ ను కలిసి సాయంత్రం  తీర్పు కాపీని అందించారు.  హైకోర్టు తీర్పు ఆధారంగా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలను ప్రకటించాలని కోరారు.  2018 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో  ఆస్తులు, కేసుల వివరాలను సమర్పించలేదని  మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరావుపై  మాజీ ఎమ్మెల్యే  జలగం  వెంకటరావు  2019 లో  హైకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు ఈ నెల  25న  కీలక  తీర్పును వెల్లడించింది. 

also read:అనర్హత వేటు: సుప్రీంకు వెళ్లే వరకు తీర్పును నిలిపివేయాలని హైకోర్టులో వనమా పిటిషన్

ఇదిలా ఉంటే  నిన్న ఇచ్చిన తీర్పును  అమలు చేయవద్దని  హైకోర్టులో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఇవాళ పిటిషన్ దాఖలు  చేశారు. ఈ పిటిషన్ పై వాదనలను హైకోర్టు వింది.  తీర్పును రిజర్వ్  చేసింది. తాను సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేసేవరకు  ఈ తీర్పును అమలు చేయవద్దని  వనమా వెంకటేశ్వరరావు  కోరారు.

2018  ఎన్నికల్లో కొత్తగూడెం  అసెంబ్లీ ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు  కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి జలగం వెంకటరావుపై విజయం సాధించారు. ఆ తర్వాత పరిణామాల్లో  వనమా వెంకటేశ్వరరావు  కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios