అతడితో పాటు మరికొందరు ఈవెంట్ ఆర్గనైజర్స్‌ని అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాలను సీజ్ చేశారు.
హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జబర్దస్త్ కమెడియన్ ఒకరు పట్టుబడటం కలకలం రేపుతోంది. గత రాత్రి పోలీసులు జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. దీనిలో జబర్దస్త్ తన్మయితోపాటు ఈవెంట్ మేనేజర్స్, పలువురు పట్టుబడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఐతే జూబ్లిహిల్స్‌లో చేసిన తనిఖీల్లో జబర్దస్త్ కమెడియన్ తన్మయ్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడితో పాటు మరికొందరు ఈవెంట్ ఆర్గనైజర్స్‌ని అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాలను సీజ్ చేశారు. వెస్ట్ జోన్ జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహించిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 5 కార్లు , 2 ఆటోలు, 12 బైక్‌లను పోలీసులు పట్టుకున్నారు.
ఐతే కొందరు అమ్మాయిలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము హోంమంత్రి మహమూద్ అలీ బంధువులమని.. మమ్మల్నే పట్టుకుంటారా అని దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఐనా న్యూసెన్స్ చేయడంతో వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన తన్మయ్ చాలా కాలంగా జబర్దస్త్‌లో చేస్తున్నాడు. ఐతే ఎక్కువగా లేడీ గెటప్స్ వేస్తుంటాడు.
