జడ్చర్ల కాంగ్రెస్ నేత జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఇల్లు, గచ్చిబౌలి కార్యాలయాల్లో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది.

అలాగే జడ్చర్లలోని రంగారెడ్డిగూడలోని అనిరుధ్‌రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. గత రెండ్రోజులుగా అనిరుధ్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.