మైహోమ్స్ సంస్థతో పాటు టీవీ9 ఛానెల్‌పై ఐటీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. హైటెక్ సిటీలో ఉన్న మైహోమ్స్ కార్యాలయంతో పాటు సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరావు నివాసంపై దాదాపు 200 మంది అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు సోదాలు నిర్వహించారు. ఈ దాడులలో పలు విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. 

రామేశ్వర రావు కంపెనీలకు సంబంధించిన అన్ని పత్రాలు కూడా సజావుగానే ఉన్నాయని భావిస్తున్నారు. అయితే, నగదు లావాదేవీలు, మనీలాండరింగ్ వంటివి ఏమైనా జరిగాయా  అనే కోణంలో ఆదాయం పన్ను శాఖ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టీవీ9 న్యూస్ చానెల్ కొనుగోలు వివాదం రచ్చకెక్కిన విషయం తెలిసిందే.