Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్: ఆరేళ్లలో రూ.700 కోట్లు.. వెలుగులోకి రియల్ ఎస్టేట్ కంపెనీల బండారం

హైదరాబాద్‌లో రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రెండు సంస్థలు యాదాద్రి సహా హైదరాబాద్ చుట్టు పక్కల వెంచర్ల‌తో పాటు అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నాయి

it officials raids on real estate companies in hyderabad ksp
Author
Hyderabad, First Published Mar 31, 2021, 10:13 PM IST

హైదరాబాద్‌లో రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రెండు సంస్థలు యాదాద్రి సహా హైదరాబాద్ చుట్టు పక్కల వెంచర్ల‌తో పాటు అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నాయి.

ఈ సంస్థలపై చేసిన దాడుల్లో రూ. 11.8 కోట్ల నల్లధనంతో పాటు రూ.1.93 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ రెండు సంస్థలు గడిచిన ఆరేళ్ల కాలంలో రూ. 700 కోట్ల నల్లధనం లావాదేవీలకు పాల్పడినట్లు ఆధారాలు గుర్తించారు.

తనిఖీల్లో భాగంగా కీలకమైన డాక్యుమెంట్లు, నల్ల ధనానికి సంబంధించిన చేతిరాత పుస్తకాలను సీజ్ చేశారు. ఈ రెండు  సంస్థలు నగదు లావాదేవీలతో పలు అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios