తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లోని 37 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలను కాళేశ్వరం తీర్చనుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఒక ఇంజనీరింగ్ అద్బుతం. దీని నిర్మాణంలో ఎన్నో విశేషాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 199 కిలోమీటర్ల మేర నదీ జలాలు ఏడాది పొడవునా నిల్వ ఉంటాయి.

ప్రాజెక్టులో భాగంగా వంద మీటర్ల లోతులో ఉండే గోదావరి నుండి 618 మీటర్ల ఎత్తుకు ఆరు దశల్లో నీటిని ఎత్తిపోస్తారు.ఈ స్థాయిలో నీటిని ఎత్తిపోసేందుకు భారీ మోటార్ పంపులను విదేశాల నుండి తెప్పించారు.

ఇక ఈ ప్రాజెక్ట్‌లో నిర్మించిన నీటిని తీసుకుకపోవడానికి గ్రావిటీ కాలువల నిర్మాణం ఒక రికార్డు.. వీటి మొత్తం పొడవు 1,531 కిలోమీటర్లు. కాళేశ్వరం ప్రాజెక్ట్ భూగర్భంలో 330 మీటర్ల లోతులో 203 కిలోమీటర్ల పొడవైన సొరంగాలను నిర్మించారు.

అలాగే ఈ భూగర్భంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా సొరంగాలను దాటాలంటే కనీసం 4 గంటల సమయంలో పడుతుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లోని 8వ ప్యాకేజీలో నిర్మితవుతున్న లక్ష్మీపూర్ పంప్ హౌస్.. ఒక్కో మోటారు 139 మెగావాట్ల సామర్ధ్యం కలది.

మొత్తం ఏడు మోటార్ల ద్వారా రోజుకు ఇవి 21 వేల క్యూసెక్కుల నీటిని తోడిపోస్తాయి. వేలాది మంది కార్మికులు, ఇంజనీరింగ్ నిపుణులు రాత్రంబవళ్లు కష్టపడి అతి తక్కువ సమయంలోనే దీనిని పూర్తి చేశారు.

నీటిని సరఫరా చేసే మార్గం పొడవు- 1,832 కి.మీ
గ్రావిటీ ప్రెషర్‌ కాలువ పొడవు -1,531 కి.మీ
గ్రావిటీ టన్నెల్ పొడవు -203 కి.మీ

లిఫ్టులు- 22
పంప్ హౌజులు - 22
ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్ - 4,627 మెగావాట్లు
విద్యుత్ స్టేషన్లు- 19

* ఒక్క రోజులోనే 21 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు
* రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే పంప్ హౌస్‌లు

* మొత్తం బ్యారేజ్‌లు -12
* మేడిగడ్డ బ్యారేజ్ నిల్వ సామర్ధ్యం- 16,17 టీఎంసీలు
* అన్నారం బ్యారేజీ నీటి నిల్వ సామర్ధ్యం 10.87 టీఎంసీలు
* సుందిళ్ల బ్యారేజీ నీటి నిల్వ సామర్ధ్యం 8.83 టీఎంసీలు
* మేడారం జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 0.78 టీఎంసీలు
* అనంతగిరి జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 3.50 టీఎంసీలు
* రంగనాయక సాగర్‌ జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 3 టీఎంసీలు
* మల్లన్నసాగర్‌ జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 50 టీఎంసీలు
* మల్కపేట జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 3 టీఎంసీలు
* కొండ పోచమ్మ సాగర్‌ నీటి నిల్వ సామర్ధ్యం 15 టీఎంసీలు
* గంధమల్ల జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 9.87 టీఎంసీలు
* బస్వాపురం జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 11.39 టీఎంసీలు
* కొండెం చెరువు నీటి నిల్వ సామర్ధ్యం 3.50 టీఎంసీలు

* ప్రాజెక్టులో మొత్తం నీటి వినియోగం 237 టీఎంసీలు
* 5 నెలల పాటు రోజుకు 2 టీఎంసీల నీరు ఎత్తిపోత
* 85 గేట్లు, 1.63 కిలోమీటర్ల వెడల్పుతో మేడిగడ్డ బ్యారేజ్ 
* మొత్తం ప్రాజెక్ట్‌కు 8.5 కోట్ల సిమెంట్ వినియోగం
* 4.2 లక్షల మెట్రిక్ టన్నలు స్టీల్ వాడకం
* 1.17 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక వాడకం
* 53 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపని
* ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేసిన కార్మికులు- 60 వేల మంది
* అమెరికా, ఫిన్లాండ్ , జర్మనీ, చైనా, జపాన్‌ దేశాల నుంచి పంపుల దిగుమతి
* మొత్తం ప్రాజెక్ట్ వ్యయం - రూ.85 వేల కోట్లు