ఈ నెల 12న ఇంటినుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. బాలిక తండ్రి గ్రామంలో, చుట్టుపక్కల వెతికినా ఆచూకి లభించకపోవడంతో గురువాతం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

రంగారెడ్డి జిల్లా : బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న ఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కుల్కచర్లకు చెందిన బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నెల 12న ఇంటినుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. బాలిక తండ్రి గ్రామంలో, చుట్టుపక్కల వెతికినా ఆచూకి లభించకపోవడంతో గురువాతం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

అదే గ్రామానికి చెందిన శ్రీను మీద అనుమానం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు శ్రీను బాలికను పెళ్లి చేసుకున్నట్లుగా గుర్తించారు. బాలికను సఖి సెంటర్ కు తరలించి.. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.