Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్ సెకండియర్ పరీక్షలపై రాని క్లారిటీ... ప్రభుత్వానికి బోర్డ్ నివేదిక, ప్రత్యామ్నాయాలివే..?

తెలంగాణలో ఈసారి ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారా..? నిర్వహిస్తే అదెప్పుడు...? విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఇప్పుడు ఇదే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే లాక్‌డౌన్ ముగాశాక దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు వున్నాయని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. 

inter board report to telangana govt for exams ksp
Author
Hyderabad, First Published Jun 5, 2021, 7:31 PM IST

తెలంగాణలో ఈసారి ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారా..? నిర్వహిస్తే అదెప్పుడు...? విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఇప్పుడు ఇదే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే లాక్‌డౌన్ ముగాశాక దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు వున్నాయని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇప్పటికే దీనిపై కసరత్తు మొదలుపెట్టిన ఇంటర్ బోర్డ్ ప్రత్యామ్నాయాలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండియర్ ఎడ్యుకేషన్ 12వ తరగతి ఫలితాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలను ఏ ప్రాతిపదికన ఇవ్వాలన్న దానిపై కమిటీ వేసింది. అలాగే పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివేవారి పరిస్థితి ఏంటన్న దానిపై చర్చ మొదలైంది. పరీక్షలను రద్దు చేస్తారా..? నిర్వహిస్తారా అన్న దానిపై క్లారిటీ లేదు.

Also Read:సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు, మరి ఫలితాలెలా.. కమిటీని నియమించిన బోర్డ్

సీబీఎస్ఈ పరీక్షలు రద్దయ్యాయి కాబట్టి.. ఈ పరీక్షలు కూడా రద్దవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వర్గాలు మాత్రం అన్ని ఆప్షన్స్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నాయో దానిపై వివరాలు తెప్పించుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే జూలై 2వ వారంలో పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రానికి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.

దీంతో దానికి ఇంకా సమయం వుంది కదా అని అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. అలాగే పరీక్షా సమయాన్ని మూడు గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గించడం, సగం ప్రశ్నలే ఇవ్వడం ఇలాంటి అంశాలను కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. పరీక్షలు  నిర్వహించలేని పక్షంలో ఫలితాలు ఇవ్వడానికి వున్న ప్రత్యామ్నాయాలు ఏంటన్న దానిపై ఇంటర్ బోర్డ్ అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మొదటి సంవత్సరం మార్క్స్ ఆధారంగా ఫలితాలు ప్రకటించడంతో పాటు ఇతర ఆప్షన్స్ కూడా వున్నాయి అని కూడా తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్ధుల సంఖ్య 4.74 లక్షలుగా వుంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు బ్యాక్ లాగ్ వుంటే.. మినిమమ్ పాస్ మార్కులతో పాస్ చేస్తామని ఇంటర్ బోర్డ్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇంటర్ సెకండియర్ పరీక్షలపై మాత్రం క్లారిటీ లేకపోవడంతో విద్యార్ధులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios