Asianet News TeluguAsianet News Telugu

పొన్నాల లక్ష్మయ్య భార్యకి అవమానం

నామినేషన్ కేంద్రానికి వచ్చిన ఆమెను పోలీసులు లోపలికి అనుమతించకుండా బయటే అడ్డుకున్నారు. 

insult to congress leader ponnala wife
Author
Hyderabad, First Published Nov 20, 2018, 11:01 AM IST

కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య  భార్య  అరుణాదేవికి అవమానం జరిగింది. తన భర్త నామినేషన్ ప్రక్రియ కోసం నామినేషన్ కేంద్రానికి వచ్చిన ఆమెను పోలీసులు లోపలికి అనుమతించకుండా బయటే అడ్డుకున్నారు. తర్వాత ఉన్నతాధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో ఆమెను లోపలికి అనుమతించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం ఎన్నికల  నామినేషన్ కి చివరి రోజు అన్న విషయం తెలిసిందే. కాగా.. పొన్నాల లక్ష్మయ్య జనగమాలో నామినేషన్ వేసేందుకు తన భార్య, మద్దతుదారులతో అక్కడికి వచ్చారు. పొన్నాల లోపలికి వెళ్లగా.. ఆయన భార్య అరుణాదేవి కాస్త వెనకపడ్డారు. దీంతో.. ఆమెను లోపలికి అనుమతించేందుకు ఏపీసీ వినోద్ కుమార్ అంగీకరించలేదు.

ఇప్పటికే నలుగురు లోపలికి వెళ్లారని.. అంతకన్నా ఎక్కువ మందిని లోపలికి పంపమని ఆయన తేల్చిచెప్పారు. దీంతో అరుణాదేవి.. ఏసీపీతో వివాదానికి దిగారు. పరిస్థితిని గమనించిన ఎన్నికల కమిషన్ స్టేట్ జనరల్ అబ్జర్వర్‌ రాజేంద్ర చోలే గొడవ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీపీ వినోద్‌కుమార్‌ను మందలించారు. సస్పెండ్‌ చేయిస్తానని హెచ్చరించారు.అనంతరం ఆమెను లోపలికి పంపించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios