Asianet News TeluguAsianet News Telugu

నాకు మంత్రి పదవి ఇస్తేనే వస్తా: ఇండిపెండెంట్ అభ్యర్థి కండీషన్

తెలంగాణ ఎన్నికల ఫలితాలు హంగ్ వస్తుందో లేదో తెలియదు కానీ స్వతంత్ర అభ్యర్థులకు మాత్రం భలే గిరాకీ తగిలింది. ఉందిలే మంచికాలం ముందు ముందూనా అన్నచందంగా స్వతంత్ర అభ్యర్థులు అనుకున్నారో ఏమో తెలియదు  కానీ నామినేషన్ అయితే వేసేశారు. ఎన్నికల్లో పోటీ చేసి అధికార ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. 

independent candidate k.chandar says which party gives minister post i support that party
Author
Karimnagar, First Published Dec 10, 2018, 8:03 PM IST

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాలు హంగ్ వస్తుందో లేదో తెలియదు కానీ స్వతంత్ర అభ్యర్థులకు మాత్రం భలే గిరాకీ తగిలింది. ఉందిలే మంచికాలం ముందు ముందూనా అన్నచందంగా స్వతంత్ర అభ్యర్థులు అనుకున్నారో ఏమో తెలియదు  కానీ నామినేషన్ అయితే వేసేశారు. ఎన్నికల్లో పోటీ చేసి అధికార ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. 

మళ్లీ అదే స్వతంత్రర అభ్యర్థులు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మెున్నటి వరకు సీటివ్వండంటూ అధినేతల చుట్టూ పార్టీ కార్యాలయాలు చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన నేతలు చివరికి టిక్కెట్ దక్కకపోవడంతో వారే స్వతంత్రంగా బరిలోకి దిగారు. 

ఆనాడు సీటు కోసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యని నేతలంతా ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు. అరే భాయ్ మా ఫోన్లు జర లిఫ్ట్ చేస్తుండు అంటూ బుజ్జగిస్తున్నారు. నిన్న మెున్నటి వరకు నువ్వు నా పక్కనే కూర్చున్నావ్ గుర్తుకు లేదా అంటూ గతాన్ని గుర్తు చేస్తున్నారు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆరోజుల్లో వేరు ఈరోజుల్లో ఇలా అంటూ షాక్ ఇస్తున్నారు. 

స్వతంత్రులు ఇరుపార్టీలకు అవసరం  కావడంతో వారు కండీషన్లు పెడుతున్నారు. తమకు మంత్రి పదవి ఇస్తేనే వస్తామంటూ కండీషన్స్ అప్లై చేస్తున్నారు. దీంతో ఆయా పార్టీలు చూద్దాం కానీ ముందు అయితే మద్దతు ఇవ్వు అంటున్నారట. 

అయితే కాంగ్రెసోళ్లు మంత్రి పదవి ఇస్తానన్నారు..మీరు ఇస్తారా ఇయ్యరా లేకుంటే చెప్పండి వాళ్లకి ఓకే చెప్పేస్తా అంటున్నారట. దీంతో వారి గొంతెమ్మ కోరికలు తీర్చాలో లేక ఏం చెయ్యాలో అర్థం కావడం లేదట నేతలకు. 

ఇకపోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు కోరుకంటి చందర్. చందర్ గతంలో టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. అయితే అధికార పార్టీ టిక్కెట్ ఇవ్వకపోడంతో ఆయన స్వతంత్రంగా బరిలోకి దిగారు. 

గెలిచే అవకాశం ఉందంటూ ప్రచారం జరగడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మనోడికి ఫోన్లు చేస్తున్నాయట. మద్దతు కోరాయట. అయితే తనకు మంత్రి పదవి ఇస్తేనే మద్దతు ఇస్తానంటూ భేషరతుగా కండీషన్స్ పెడుతున్నారు చందర్. 

తాను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అధికార పార్టీ పట్టించుకోలేదని తన మనస్సులో ఉన్న ఆవేశాన్ని బయటకు కక్కేశారు. ఇప్పుడు తమ అవసరం వచ్చింది కాబట్టి గుర్తుకు వచ్చామా అంటూ ఫోన్లోనే నిలదీసినట్లు చెప్పారు. తమకు మంత్రి పదవి ఎవరు ఇస్తే వారికే మద్దతు పలుకుతానని చెప్పేశారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆద్యంతం ఉత్కంఠ రేపుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే కాదు తామే అధికారాన్ని ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇలా ఇరుపార్టీలు ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. 

పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఇరు పార్టీలు స్వతంత్ర అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఒకవేళ హంగ్ ఏర్పడినా, కాస్త అటు ఇటు ఫలితాలు వచ్చిన స్వతంత్రులతో గట్టెక్కాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. 

ఇప్పటికే రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేతలు తమ పార్టీ రెబల్స్ తోపాటు ఇతర పార్టీ రెబెల్ అభ్యర్థులను సైతం తమకు మద్దతు పలకాలంటూ కోరుతున్నారు. ఫోన్లు కూడా చేస్తున్నారు. అటు టీఆర్ఎస్ సైతం స్వతంత్రులతో టచ్ లో ఉంది. అయితే స్వతంత్ర అభ్యర్థుల గొంతెమ్మ కోరికలు అటు అధికార పార్టీని, ఇటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కరి చేస్తున్నాయట. 

Follow Us:
Download App:
  • android
  • ios