కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. తెలంగాణకు వర్ష సూచన
కేరళను నైరుతి రుతుపవనాలు తాకిన నేపథ్యంలో దక్షిణాదిలోని పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. తాజా రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం వుందని ఐఎండీ తెలిపింది.

కేరళను నైరుతి రుతుపవనాలు తాకిన నేపథ్యంలో దక్షిణాదిలోని పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ మోస్తారు వర్షం కురిసింది. ఇదిలావుండగా.. శుక్రవారం తెలంగాణలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశ వుందని వాతావరణ శాఖ తెలిపింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణ పేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ , అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ వెల్లడించింది.
కాగా.. కేరళ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకినట్లు ఐఎండీ ప్రకటించింది. దీంతో పలు ప్రాంతాల్లో బుధవారం నాడు వర్షపాతం నమోదైంది. ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడింది. దీని తీవ్రతతో వచ్చే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ నెల 5వ తేదీన వాతావరణ శాఖ తెలిపింది.
ALso Read: చల్లటి కబురు: కేరళను తానికి నైరుతి రుతుపవనాలు
ఈ నెల 8, 9 తేదీల్లో కేరళలో రుతుపవనాలు తాకే అవకాశం ఉందని గతంలోనే ఓ ప్రైవేట్ వాతావరణ సంస్థ పేర్కొంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ తొలి రెండు రోజుల్లోనే కేరళను తాకుతాయి. అయితే ఈ ఏడాది ఏడు రోజులు ఆలస్యంగా కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. 48 గంటల్లో రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది. త్వరలోనే తమిళనాడు, కర్ణాటకలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది.