‘‘ అబ్బే.. కట్నం లేనిదే మీ అమ్మాయిని చేసుకోం’’ అనే మాట నుంచి ‘‘ కట్నం ఎందుకు లెండీ’’, ‘‘ కట్నం వద్దండి’’ అని చెప్పేటంతగా సమాజ ఆలోచనలలో మార్పు మెల్లిగా వస్తోంది.

ఈ మార్పులో కొంత భాగస్వామ్యం మాకు వుందని గర్వంగా చెప్పగలం. అయితే ఇప్పటికీ అబ్బాయిలకు ఇంత ఇస్తామని వస్తున్నారండీ అనే వాళ్లు ఇంకా అక్కడక్కడా కనపడుతూనే వున్నారు.

అలాగే అదే సమయంలో మేము కట్నం లేకుండా వివాహం చేసుకుంటాం అని ధైర్యంగా చెప్పే పెళ్లి కొడుకులూ, కట్నం తీసుకోని వాళ్లనే చేసుకుంటాం అనే పెళ్లి కూతుళ్లూ పెరిగారు.

అలాంటి అద్భుతమైన వారందరికీ గత పధ్నాలుగు సంవత్సరాలుగా మా ‘ ఐ డోంట్ వాంట్ డౌరీ డాట్ కాం’ ‘‘ IdontwantDowry.com అనువైన వేదిక కల్పిస్తూనే వస్తోంది. వారి ఆలోచనలని, భావాలని ఒకరికొకరికి వినిపించి వివాహబంధంతో ఒక్కటయ్యేలా చేస్తోంది.

అలా ఒక్కటైన జంటల ఆశీర్వచనాలతో, స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా స్వయంవరం కొనసాగించాలని నిర్ణయించాము. మరికొంతమంది ఉన్నత ఆలోచనలు కలిగిన జంటలను ఒకటి చేయాలని యోచిస్తోంది మా సంస్థ.

కాకపోతే ప్రస్థుతం కరోనా మహమ్మారితో అందరం ఓపెన్‌గా కలవటానికి భయపడుతున్నాం... ఇబ్బంది పడుతున్నాం. కట్నం అనేది మహమ్మారి కరోనా కన్నా ప్రమాదకరమైనదని అర్ధం చేసుకున్న వాళ్లం.. అందుకే ఈ నెల డిసెంబర్ 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జూమ్ యాప్ ద్వారా ఈసారి ఆన్‌లైన్ వేదికగా పదిహేనవసారి స్వయంవరం వివాహవేదిక నిర్వహించాలని నిర్ణయించాం.

అబ్బాయిలూ.. మీది కట్నం తీసుకోకుండా వివాహం చేసుకునే వ్యక్తిత్వం అయితే స్వయంవరంకు ఇదే మా ఆహ్వానం. అలాగే అమ్మాయిలూ..కట్నంతో అబ్బాయిలని కొనుక్కోవటం నాన్సెన్స్ అని నమ్మితే మీరూ రండి.. వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయి.

కట్నం తీసుకోని వివాహాలు మా సంస్థ ఏర్పాటు చేసే స్వయంవరంలో నిర్ణయించబడతాయి అని మీరే పదిమందికి చెప్తారు. ఆదర్శం ఆచరణలోకి తీసుకురండి.. సరైన భాగస్వామిని మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఈ స్వయంవరంలో పాల్గొనడం కోసం, మరిన్ని వివరాలకు www.IdontwantDowry.Comని చూడండి. లేదా 9885810100 నెంబర్‌కి ఫోన్ చేయాలని వెబ్‌సైట్ మేనేజర్ రమేశ్ తెలిపారు.