Asianet News TeluguAsianet News Telugu

ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి వారసులను తయారు చేస్తున్నా:జానారెడ్డి

ప్రజలను చైతన్యవంతులను చేయడానికి తన వారసులను తయారు చేస్తున్నానని మాజీ మంత్రి జానారెడ్డి చెప్పారు. వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో జానారెడ్డి  పోటీ చేయనున్నారు.

I stands for people of Nagarjunasagar constituency: Congress Leader Jana Reddy lns
Author
First Published Oct 8, 2023, 5:13 PM IST


హైదరాబాద్:ప్రజలను చైతన్యవంతులను చేయడానికి తన వారసులను తయారు చేస్తున్నానని  మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చెప్పారు.ఆదివారంనాడు  కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఉచిత కరెంట్ ను మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటామన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్, మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాల నుండి జానారెడ్డి ఇద్దరు కుమారులు  టిక్కెట్ల కోసం  ధరఖాస్తు చేసుకున్నారు. నాగార్జునసాగర్ నుండి రఘువీర్, మిర్యాలగూడ నుండి జయవీర్ ధరఖాస్తు చేసుకున్నారు. అయితే  2024 లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది.  తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని జానారెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్థిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో దిగిన నోముల నరసింహయ్య చేతిలో జానారెడ్డి ఓడిపోయాడు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో నోముల నరసింహయ్య  ఓటమి పాలయ్యాడు.  దీంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  జానారెడ్డి మరోసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగాడు.  ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా నోముల నరసింహయ్య తనయుడు భగత్ పోటీ చేశారు.ఈ ఎన్నికల్లో జానారెడ్డిపై నోముల నరసింహయ్య తనయుడు భగత్ విజయం సాధించారు.  వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుండి జానారెడ్డి తనయుడు పోటీ చేసే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios