వామన్‌రావు దంపతుల హత్యతో సంబంధం లేదు: పోలీసుల విచారణలో పుట్ట మధు

 లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మెన్  పుట్ట మధు పోలీసులకు చెప్పారు. 

I don't have any involvement in advocate vamanrao couple murder case lns

కరీంనగర్: లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మెన్  పుట్ట మధు పోలీసులకు చెప్పారు. మూడు రోజుల పాటు రామగుండం పోలీసులు  పుట్ట మధును విచారించారు. సోమవారం నాడు రాత్రి పుట్ట మధును పోలీసులు  ఇంటికి పంపారు. ఇవాళ మరోసారి విచారణకు రావాలని పుట్ట మధుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

also read:పుట్టమధుకు మరోసారి పోలీసుల నోటీసులు: విచారణకు రావాలని ఆదేశం

విచారణలో పోలీసులకు పుట్ట మధు చెప్పిన విషయాలను ఓ తెలుగు మీడియా ఛానెల్ ప్రసారం చేసింది.  ఈ కేసులో తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని పోలీసులకు ఆయన చెప్పారు. 10 రోజుల పాటు తాను పారిపోయిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. తన పాత మిత్రులు తనకు షెల్టర్ ఇచ్చారని ఆయన పోలీసులకు తెలిపారు. కుంట శ్రీను, బిట్టు శ్రీనులపై వామన్ రావు  కేసులు పెట్టారన్నారు. వామన్ రావుకు చాలామంది శత్రువులున్నారని పుట్ట మధు పోలీసులకు తెలిపినట్టుగా ఆ న్యూస్ ఛానెల్ తెలిపింది. కుంట శ్రీను, బిట్టు శ్రీనులు వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్యలు చేసి ఉండొచ్చని ఆయన పోలీసుల విచారణలో చెప్పారని  ఆ చానెల్ ప్రసారం చేసింది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios