Asianet News TeluguAsianet News Telugu

మెడికల్ ఎమర్జెన్సీ: లాక్ డౌన్ వేళ ఆఫ్గనిస్తాన్ నుంచి మన హైదరాబాదీ వెనక్కి

హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఆఫ్గనిస్తాన్ లో ఉద్యొగ నిమిత్తం ఉంటున్నాడు. అక్కడ అతడికి ఒక ప్రమాదంలో తొడ ఎముక విరిగింది. ఆఫ్గనిస్తాన్ లోని ఆ ప్రాంతంలో అతడికి చికిత్సనందించి సర్జరీ చేయడానికి ఎవరు లేరు. 

Hyderabadi from Afghanistan airlifted due to medical emergency
Author
Hyderabad, First Published Apr 21, 2020, 1:50 PM IST

లాక్ డౌన్ వేళ ప్రపంచమంతా స్తంభించిపోయింది విషయం తెలిసిందే. మన భారతదేశం ఇప్పటికే మన అంతర్జాతీయ సరిహద్దులంన్నింటిని మూసేయడంతోపాటుగా విమానాశ్రయాలను, నౌక కేంద్రాలను కూడా మూసేసిన విషయం తెలిసిందే. 

హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఆఫ్గనిస్తాన్ లో ఉద్యొగ నిమిత్తం ఉంటున్నాడు. అక్కడ అతడికి ఒక ప్రమాదంలో తొడ ఎముక విరిగింది. ఆఫ్గనిస్తాన్ లోని ఆ ప్రాంతంలో అతడికి చికిత్సనందించి సర్జరీ చేయడానికి ఎవరు లేరు. 

మరికొన్ని రోజులు అలానే గనుక ఆ ఎముకను వదిలేస్తే... అతడు శాశ్వతంగా అవిటివాడుఅయిపోవడమే కాకుండా ఇన్ఫెక్షన్ వల్ల ప్రాణాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. 

ఈ నేపథ్యంలో ఐకాట్ అనే ఎయిర్ అంబులెన్సు సంస్థ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి భారత ప్రభుత్వంతో మాట్లాడి నాలుగు రోజులపాటు శ్రమించి అతడిని తీసుకురానుంది. మన శంషాబాద్ విమానాశ్రయంలో మరికాసేపట్లో విమానం ల్యాండ్ అవనుంది. 

వేరే ఇతర దేశాల్లో ఇలా మెడికల్ ఎమెర్జెన్సీలు ఉన్న కూడా దీన్ని ఉపయోగించుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. వీరు గత కొన్ని రోజుల కింద కాకినాను నుంచి కూడా ఒక వ్యక్తిని హైదరాబాద్ కి తీసుకువచ్చారు. 

ఇకపోతే 24 గంటల్లో ఏపీ రాష్ట్రంలో కొత్తగా 35 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్  కేసులు 757కి చేరుకొన్నాయి.కరోనా వైరస్ సోకి ఇప్పటికే 22 మంది మృతి చెందినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

కరోనా వైరస్ సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొంది  96 మంది డిశ్చార్జ్ అయినట్టుగా  ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.గత 24 గంటల్లో  కర్నూల్ లో 10, గుంటూరులో 09, తూర్పుగోదావరిలో 04, కడపలలో 06, అనంతపురంలో 03, కృష్ణాలో 03 కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

వివిధ జిల్లాలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి

అనంతపురం-36
చిత్తూరు-53
తూర్పుగోదావరి-26
గుంటూరు-158
కడప-46
కృష్ణా-83
కర్నూల్-184
నెల్లూరు-67
ప్రకాశం-44
విశాఖపట్టణం-21
పశ్చిమగోదావరి-39

రాష్ట్రంలోని మొత్తం 757 కరోనా పాజిటివ్ కేసుల్లో 639 కేసులు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios