భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ కడుపున పుట్టిన బిడ్డను చంపేసి.. అనంతరం తన ప్రాణాలు కూడా తీసేసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఎల్బీనగర్ కి చెందిన రాజశేఖర్ ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. అతనికి భార్య సుజాత(27), కొడుకు నైనీష్(18నెలలు) ఉన్నారు. అయితే.... గత కొంతకాలంగా సుజాతకు భర్త రాజశేఖర్ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. వాటిని తట్టుకోలేక సోమవారం మధ్యాహ్నం భర్త ఇంట్లో లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది.

అంతక ముందు తన 18నెల కొడుకు ను హత్య చేసి.. అనంతరం తాను కూడా ఫ్యాన్ కి ఉరి వేసుకుంది. ఆఫీసుకు వెళ్లిన భర్త ఇంటికి వచ్చి చూసేసరికి.. భార్య, కుమారుడు శవాలై కనిపించారు. సుజాత సోదరుడు యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేకే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.