నిర్మాణంలో ఉన్న భవనంలో ఓ టెక్కీ అనుమానస్పద స్థితిలో చనిపోయిన సంఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ లో చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ గుంతలో పడి చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... మణికొండకు చెందిన మనోజ్ కృష్ణ(20) ఇటీవల ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కాగా... ఇటీవల అతను ఓ ఐటీ కంపెనీలో ఇంటెన్షన్ షిప్ కి జాయిన్ అయ్యాడు.  కొద్ది నెలల క్రితం అతని తల్లిదండ్రులు చెన్నై కి వెళ్లారు.  కాగా... శనివారం మధ్యాహ్నం ఓ నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ గుంతలో పడి చనిపోయి కనిపించాడు. గమనించిన సెక్యురిటీ  పోలీసులకు సమాచారం అందించాడు.

కాగా... మనోజ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా మనోజ్ ఏడో అంతస్తు నుంచి కింద పడి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. కాగా అతనిది ఆత్మహత్య?, హత్యా?, ప్రమాదామా అన్న మూడు కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.